పిఎస్ఎల్‌వి ప్రయోగం గ్రాండ్ సక్సెస్

 

పీఎస్‌ఎల్వీ-సీ26 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం తెల్లవారుజామున 1:32 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి26 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో ఇస్రో రూపొందించింది. ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువుగల ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి) ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సి 26 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu