రాత మారని ఢిల్లీకి మరో పరాజయం

IPL 6: Kings XI Punjab defeat Delhi Daredevils by 5 wickets, IPL 6: Kings XI Punjab push aside Delhi Daredevils for effortless win, IPL 6: Kings XI Punjab cruise past Delhi Daredevils

 

ఢిల్లీ మళ్ళీ పరాజయాల బాటలో నడుస్తుంది. ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు మంగళవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో మళ్ళీ ఓడిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్ళు నిలవలేకపోయారు..  ఢిల్లీ కెప్టెన్ మహేళ జయవర్థనే 4 బంతుల్లో 4 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో మైక్ హస్సీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 95 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 21 బంతుల్లో 23 పరుగులు (2 బౌండరీలు 1 సిక్సర్) కొట్టి ఊపు మీద ఉన్నట్లు కనిపించాడు కానీ హర్మీత్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ కు చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ వార్నర్ 36 బంతుల్లో 40 పరుగులు (4 బౌండరీలు 1 సిక్సర్) ప్రవీణ్ కుమార్ క్లీన్ బౌల్డ్, జునేజా 20 బంతుల్లో 14 పరుగులు (1 బౌండరీ) హర్మీత్ సింగ్ బౌలింగ్ లో ఆవానా క్యాచ్ పట్టడం ద్వారా అవుటయ్యారు. నాలుగో వికెట్ కు 39 పరుగులు జతచేశారు. మూడు బంతుల వ్యవధిలో జునేజా ను హర్మీత్ బౌలింగ్ లో ఆవానా క్యాచ్ పట్టడంతో, జాదవ్ 0 హర్మీత్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడంతో వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ చివర్లో ఇర్ఫాన్ పఠాన్ 17 బంతుల్లో 14 పరుగులు (1 బౌండరీ) నాటౌట్, అగార్కర్ 9 బంతుల్లో 9 పరుగులు నాటౌట్ గా నిలిచారు. వాండెర్ మెర్వ్ 8 పరుగులు ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టడం ద్వారా, ఇయాన్ బోథా 1 భట్ బౌలింగ్ లో మిల్లర్ క్యాచ్ ద్వారా అవుట్ అయ్యారు. హర్మీత్ సింగ్ 3, ప్రవీణ్ కుమార్ 2, ఆవానా 1, భార్గవ్ భట్ 1 వికెట్లు పడగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. టార్గెట్ చిన్నదే అయినా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది పంజాబ్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ 3 బంతుల్లో 6 పరుగులు (1 బౌండరీ) ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ఇయాన్ బోథా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మూడో ఆటగాడిగా బరిలోకి దిగిన 10 బంతుల్లో 18 పరుగులు (3 బౌండరీలు) మెర్వ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్, ఓపెనర్ మన్ దీప్ సింగ్ 15 బంతుల్లో 24 పరుగులు (5 బౌండరీలు) రనౌట్ గా వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 44 పరుగులు జోడించారు. వోహ్రా 8ను ఇయాన్ బోథా క్యాచ్ అండ్ బౌల్డ్ ద్వారా అవుట్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 39 బంతుల్లో 34 పరుగులు (3 బౌండరీలు) నాటౌట్ డేవిడ్ హస్సీ 21 బంతుల్లో 20 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్)ను నెహ్రా బౌలింగ్ లో ఇయాన్ బోథా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. పియూష్ చావ్లా 5 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. 121 పరుగుల టార్గెట్ ను 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇర్ఫాన్, నెహ్రా, ఇయాన్ బోథా లకు ఒకొక్క వికెట్ దక్కింది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్మీత్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.