మారిన తత్కాల్ టికెట్ నిబంధనలు.. ఇకపై రిఫండ్

 

తత్కాల్ టికెట్ల పద్ధతిపై భారతీయ రైల్వే శాఖ కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అయితే తత్కాల్ టికెట్ బుక్ చేసుకొని.. క్యాన్సిల్ చేసుకుంటే ఎటువంటి రిఫడ్ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం.. తత్కాల్ పద్దతి ద్వారా టికెట్ బుక్ చేసుకొని.. క్యాన్సిల్ చేసుకుంటే సగం మొత్తాన్ని చెల్లించనున్నారు. అంతేకాదు తత్కాల్ బుకింగ్ సమయం కూడా అధికారులు మార్చారు. ఏసీ కోచ్ లకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, స్లీపర్ కోచ్ ల్లో బెర్తుల కోసం 11 నుంచి 12 గంటల వరకూ కౌంటర్లు ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఇంకా మారిన నిబంధనలు గమనిస్తే..

 

* రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో మొబైల్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు.
* రైళ్లలో వెయిటింగ్ లిస్టులోని వారికి, తదుపరి అదే రూట్లో వచ్చే రైళ్లలో ఖాళీలను బట్టి బెర్తుల కేటాయింపు.
* బెర్తు కేటాయించిన తరువాత చార్జీల తేడాలున్నా రిఫండ్ రాదు, అదనపు చార్జీలూ ఉండవు.
* గమ్యస్థానం వచ్చే సమయానికి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వేకప్ కాల్ సదుపాయం.