మెట్రోపొలిస్ సదస్సులో ప్రణబ్ ముఖర్జీ

 

హైదరాబాద్‌లో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సు ముగింపు రోజు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు. సదస్సుకు హాజరైన దేశ విదేశాల ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. పట్టణాలు, నగరాల సమస్యలపై 156 ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు ఒకే సమావేశంలో పాల్గొనడం ఒక శుభ పరిణామమని ప్రణబ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత భారీ స్థాయిలో సదస్సును ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu