ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి సాహిత్య నోబెల్

 

ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి దక్కింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 11వ ఫ్రెంచ్ రచయిత ఈయన. పాట్రిక్‌ మోదియానోకి స్వీడిష్ నోబెల్ అకాడమీ నోబెల్ బహుమతి కింద 1.1 మిలియన్ డాలర్ల నగదు అందజేయనుంది. పాట్రిక్ మోదియానో ఎన్నో చిన్న పిల్లల పుస్తకాలు, సినిమా స్క్రిప్టులు, నవలలు రాశారు. ఒక డిటెక్టివ్ తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్ల జరిగిన పరిణామాలపై రాసిన ‘మిస్సింగ్ పర్సన్’ అనే పుస్తకం ఆయనకు రచయితగా మంచి గుర్తింపు తెచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu