నా ఆరోగ్యం భేషుగ్గా వుంది: కమల్ హాసన్
posted on Sep 17, 2014 12:17PM
.jpg)
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారని వార్తలతోపాటు, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న వదంతులు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు. ‘‘నేను షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్, డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నేను బాగానే వున్నాను. షూటింగ్ నిమిత్తం కేరళలోని మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో ఏదిపడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. రోడ్డుపక్కన వున్న దాభాల్లో తినడం, కలుషిత నీరు తాగడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఇప్పుడు నేను కోలుకున్నాను. నేను నరాల సంబంధిత వ్యాధితోనే ఆస్పత్రిలో చేరానని వచ్చిన పుకార్లు తప్పు’’ అన్నారు. కాగా, కమల్‌హాసన్ బుధవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.