ప్యాంటు జేబులో పేలిన ఫోన్ ...యువకుడికి గాయాలు

 

ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్‌‌లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే తన వివో స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి బట్టలకు అంటుకున్నాయి.

వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ మొబైల్ జేబులోంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది. స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu