తెలంగాణ ఎవరి జాగీర్?

 

హైద‌రాబాద్ న‌డి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్క‌ర  కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మ‌రెవ‌రికీ సాధ్యం కాని ఒక చ‌రిత్ర‌ను సృష్టించింది. హైద‌రాబాద్ ప్ర‌తిష్ట‌ను ఆనాడే ఆకాశానికి అంటేలా చేసింది. అంతేనా ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీలో చేర‌క ముందు ఎలా ఉండే వారో కూడా ఎవ్వ‌రికీ ఊహ‌కంద‌ని విష‌యం. గురువు ద‌గ్గ‌ర రాజ‌కీయం నేర్చుకుని ఆయ‌న మీదే పోటీ చేసిన ఘ‌నుడైన కేసీఆర్ ని కూడా ద‌గ్గ‌రకు చేర్చి.. ఆద‌రించింది టీడీపీ. ఆయ‌న‌కు అప్ప‌ట్లో ర‌వాణా మంత్రిత్వం ఇచ్చింది కూడా టీడీపీనే. త‌ర్వాత త‌న సాటి కుల‌స్తుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో.. అది చూసి ఓర్వ‌లేక కొత్త పార్టీ పెట్టారు కేసీఆర్.నిజంగా వైయ‌స్ అన్న‌ట్టు ఆనాడు బాబు మంత్రి ప‌ద‌వి  ఇచ్చి ఉండి ఉంటే కేసీఆర్ గానీ ఆయ‌న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఉండేదా? అస‌లీ సోయ‌లోనే లేక పోయావారు ఆయ‌న, ఆయ‌న పార్టీ స‌భ్యులు. ఒక‌సారి మంత్రిత్వం ఇస్తే దాన్ని స‌రిగా నిర్వ‌హించ‌లేద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. కేసీఆర్ ని ప‌క్క‌న పెట్ట‌డంతో పుట్టిన ముస‌లం.. తెలంగాణ వాదం. 

ఆనాటి నుంచి ఆయ‌న అది  ప‌నిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని విభిజించ‌డ‌మే ధ్యేయంగా.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి.. వారి ఆశల మేడ‌లపై త‌న పార్టీ పునాదును నిర్మించుకున్నారు టిడిపి వర్గాలు. అదే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్.అప్ప‌టికి ఎటు నుంచి ఎటు చూసినా అడ‌వుల‌ను త‌ల‌పించిన హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాన్ని ఇవాళ ఐటీ కారిడార్ గా మ‌ల‌చింది టీడీపి.. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ‌ కంపెనీలు రావ‌డానికి కార‌కుడైంది.. నాటి  టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు. అప్ప‌ట్లో పెద్ద పెద్ద ప్ర‌ధానుల‌కు సైతం దొర‌క‌ని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ ని దొర‌క‌బుచ్చుకుని నిమిషాల్లో ముగించాల‌ని వారు చెబితే, దాన్ని సుమారు గంట‌కు పొడిగించుకుని.. ఆపై యూఎస్ వెళ్లి అక్క‌డి మైక్రోసాఫ్ట్ యాజ‌మాన్యాన్ని హైద‌రాబాద్ లో ఒక క్యాంప‌స్ ఏర్పాటు  చేయాల్సిందిగా వేడుకుని, ఎట్ట‌కేల‌కు ఇక్క‌డికి ర‌ప్పించి.. ఒక ఐటీ బూమ్ క్రియేట్ చేసింది చంద్ర‌బాబు. ఆయ‌న  వెన‌కున్న టీడీపీ.

ఆ త‌ర్వాత అనూహ్యంగా ఈ ప్రాంతం మ‌రో సింగ‌పూర్ లా క‌నిపించ‌డంతో.. క‌న్నుకుట్టి.. ఇదంతా త‌మ‌దేనంటూ తెలంగాణ  ప్ర‌జానీకాన్ని  రెచ్చ‌గొట్టి.. రాష్ట్రం రెండుగా చీలిపోయేలా చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు టిడిపి వారు. ఆయ‌న పార్టీ. ఆ త‌ర్వాత కూడా రాష్ట్ర విభ‌జ‌న‌లో ద‌క్కాల్సిన ప‌దేళ్ల రాజ‌ధాని హోదాను ఏపీకి ద‌క్క‌కుండా త‌న  టెలిఫోన్ టాపింగ్ ద్వారా చేసిన ఘ‌న‌త వ‌హించింది కేసీఆర్ కాదా అంటున్నారు.త‌న స్వార్ధం కోసం జ‌గ‌న్న రెడ్డితో కుమ్మ‌క్క‌య్యి.. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతాలు రెండింటినీ మోసం చేసిన ఘ‌న‌త కూడా కేసీఆర్ దే. అంతేనా.. కాళేశ్వ‌రం వంటి అన‌వ‌స‌ర ఖ‌ర్చు దండ‌గ ప్రాజెక్టుల ద్వారా కోట్లు కుమ్మ‌రించుకున్నార‌ని ఆరోపించిన రాజ‌లింగం లాంటి వారిని లేకుండా చేసింది మీరు కాదా? అన్న‌ది స‌గ‌టు తెలంగాణ వాదులు సంధిస్తోన్న ప్ర‌శ్న‌.

ఒక‌రిద్ద‌రు కాదు కేసీఆర్ లాంటి ఎంద‌రో తెలంగాణ  వారిని రాజ‌కీయ ధురంద‌రులుగా తీర్చి దిద్దింది టీడీపీ. కేసీఆర్ నుంచి మొద‌లు పెడితే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ఏ పొలిటీషియ‌న్ అయినా స‌రే టీడీపీ త‌ల్లి పాలు తాగిన వారు కాదా? అదంతా మ‌ర‌చిపోయి.. ఇప్పుడిలా మాట్లాడ్డం.. త‌ల్లిపాలు తాగి ఆ రొమ్ము గుద్ద‌డంతో స‌మానం కాకుండా పోతుందా? అని  నిల‌దీస్తున్నారు స‌గ‌టు తెలంగాణ ప్ర‌జ‌లు. ఎస్ ఇది టీడీపీ జాగీరే. అప్పుడ‌ప్పుడూ ఓట‌ములు ఎదురు కావ‌చ్చుగాక‌.. కానీ కాల‌గ‌మ‌నంలో ఓట‌మి కూడా ఒక మ‌జిలీయే. ప్ర‌స్తుతం టీడీపీ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరిగి  పోటీకి నిలిస్తే మాత్రం త‌ప్పేంటి? ఎందుకంత  ఉలుకు. త‌ల్లిలాంటి పార్టీ అంటే ఎందుకంత చిన్న‌చూపు? అని నిల‌దీస్తోంది స‌గ‌టు తెలంగాణ ప్రజానీకం. ఆద‌రించ‌డానికి మేం సిద్ధం.. మీకెందుకా సంశ‌యం.. అయినా ఇంకెక్క‌డుందా తెలంగాణ వాదం.. మీ పార్టీలో తెలంగాణ అన్న ప‌దం తీసెయ్య‌డంతోనే అది తెలిసిపోవ‌డం లేదా అని తెలంగాణ  ప్ర‌జ‌లే మీ  పార్టీపై తిర‌గ‌బ‌డుతున్న వేళ‌.. ఇంకా ఎందుకా? మేక‌బోతు గాంభీర్యాలు అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం అభిమానులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu