విశాఖలో చెట్లన్నీ కూలిపోయాయి

 

హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా విశాఖపట్నంలోని చెట్లన్నీ దాదాపు కూలిపోయినట్టు తెలుస్తోంది. రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. సముద్రం దగ్గర్నుంచి గాజువాక వరకు రోడ్లన్నీ ఊడ్చిపెట్టుకుని పోయాయని సమాచారం. చెట్లు కూడా ఒకటీ అరా తప్ప అన్నీ కూలిపోయాయి. విశాఖలోనే అందంగా వుండే బీచ్ రోడ్డు భారీ స్థాయిలో కోసుకుపోయింది. ఒక దశలో సముద్రం రోడ్డు వరకు వచ్చేసింది. హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి. జగదంబ సెంటర్ తో సహా పలు రోడ్డు జంక్షన్లి దెబ్బతిన్నాయి. ఎయిర్‌పోర్టు పూర్తిగా దెబ్బతింది. చిన్న చిన్న వర్షాలకే నీరు నిలిచే రన్‌వే మీద ఇప్పుడు భారీ స్థాయిలో నీరు ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నానికి ఈ తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేయడానికే రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu