జగన్‌కు రాజకీయ లబ్థి తప్పా.. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు : హోం మంత్రి అనిత

 

వైసీపీ అధినేత జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్‌షోలు నిర్వహించారని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతు వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని  విమర్శించారు. ‘‘పొదిలిలో వేసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారు. 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో నాయకులకు తెలియాదా? జగన్‌.. పరామర్శ పేరుతో వెళ్లి రోడ్‌షో నిర్వహించారు. జగన్‌కు రాజకీయ లబ్థి తప్పించి మనుషుల ప్రాణాలంటే లేక్క లేదా అని ప్రశ్నించారు. 

ఇద్దరు వ్యక్తులు చనిపోయిన జగన్ తన పర్యాటన కొనసాగించారని  హోం మంత్రి మండిపడ్డారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణం. గాయపడిన వ్యక్తిని దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమో అని ఆమె తెలిపారు. ఏదో వాహనం ఢీ కొందన్న సమాచారం మేరకు పల్నాడు ఎస్పీ సతీష్ తొలుత అలా మాట్లాడారు. వీడియోలు చూశాక కేసు మార్చామని అదే ఎస్పీ చెప్పారు కదా. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ‘గతంలో మేం ఆంక్షలు విధించామా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.  మీరు చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడటం దారుణం. ఐదేళ్లపాటు ప్రతిపక్షనేతలను రోడ్డుమీదకు రానిచ్చారా అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu