ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయ్!
posted on Oct 3, 2024 12:47PM

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. ఇక అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వరషాలు కురుస్తాయని పేర్కొంది. కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని.. అలాగే, పొలాల వద్ద ఉండే రైతులు, రైతు కూలీలు చెట్ల కింద ఉండొద్దని పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.