ఉత్తరాఖండ్ సంక్షోభం.. బలపరీక్షలో గెలుపెవరిది..?


గత కొన్ని రోజుల నుండి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుతో కీలక ఘట్టానికి తెర దిగనున్నట్టు తెలుస్తోంది.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న బలపరీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన బలాన్నినిరూపించుకోనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపు సాధించారు. దీంతో మెజార్టీ కాంగ్రెస్ సాధించుకుంది. అయితే బీజేపీ విసిరిన వలకు 36 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సుప్రీం ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో మొత్తం 61 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. వీరితో పాటు ఇద్దరు సభ్యుల బలమున్న బీఎస్పీ, ఓ యూకేడీ ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు పలికారు. దీంతో రావత్ బలం 33కు చేరింది. ఈ సభ్యులంతా హరీశ్ రావత్ కు మద్దతు పలికితే బీజేపీకి షాక్ తగలడం ఖాయమే.

 

మరి ఈ రోజు జరగబోయే పరీక్షలో ఈ బలంతో రావత్ విశ్వాస పరీక్ష నెగ్గుతారా? ఫిరాయింపులు మరింత పెరిగి ఓడుతారా? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.