చరిత్ర సృష్టించిన హరీష్ రావు

 

టీఆర్ఎస్ పక్కా గెలిచే స్థానాలు చెప్పండి అంటే మొదటగా గుర్తొచ్చే నియోజకవర్గం సిద్ధిపేట. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బరిలో ఉన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు గెలుస్తారా? కాదు.. ఎంత మెజారిటీతో గెలుస్తారు? అనే దానిపైనే ఎన్నికలకు ముందు చర్చ జరిగింది. గత ఎన్నికల్లో 93 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన హరీష్ రావు.. ఈ ఎన్నికల్లో లక్ష పైన మెజారిటీ గెలుస్తారని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. దానికి తగ్గట్టే ఫలితం వచ్చింది. హరీష్ రావు లక్ష పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 1,19,622 ఓట్ల మెజారిటీతో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు విజయం సాధించి.. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. ఈ ఎన్నికల్లో విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హరీష్ రావు.. 14 ఏళ్లలో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై దేశంలోనే అతి చిన్నవయసులోనే ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఘనత సాధించారు. మొత్తానికి హరీష్ రావు ఈ ఎన్నికల్లో ఘన విజయంతో చరిత్ర సృష్టించారు.