అసెంబ్లీలో మంత్రిగారి రాసలీలలు

ప్రజల తలరాతలు మార్చే అతి పవిత్రమైన అసెంబ్లీలోనే ఒక బాధ్యతగల మంత్రి రాసలీలలు జరిపాడు. ఈ పనికి ఒడిగట్టింది కర్ణాటక అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై.మేటీ. బాగల్‌కోటేకు చెందిన ఓ ఉద్యోగిని తన బదిలీ విషయమై కొన్ని రోజుల క్రితం కర్ణాటక విధానసౌధలోని మేటీ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను లొంగదీసుకున్న మంత్రి పలుమార్లు రాసలీలలు జరిపాడు. అయితే ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మెన్ రహస్యంగా చిత్రీకరించాడు. దీంతో మేటీ బండారం బట్టబయలైంది. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది.

ఇటీవలే టిప్పుసుల్తాన్ జయంతి రోజున ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్..వేదికపైనే ఫోన్‌లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడటంతో పెద్ద వివాదం రేగింది. ఆ వివాదం ఇంకా ముగియకముందే ఏకంగా అసెంబ్లీలోనే మంత్రిగారు రాసలీలలకు దిగడంతో సిద్ధూ పరువు గంగలో కలిసిపోయింది. మరో వైపు , మేటీని సదరు మహిళతో కలిసి మాజీ గన్‌మెన్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. రూ.15 కోట్లు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానని గన్‌మెన్ హెచ్చరించాడు. అయితే బళ్లారికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు మంత్రిగారి రాసలీలలకు సంబంధించిన ఆడియో సీడీ బయటపెట్టడంతో కర్ణాటక ఉలిక్కిపడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu