మొగల్తూరు మొనగాళ్ళు... మోసపోయారు...

 

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన 45 మంది యువకులకు దుబాయికి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చింది. దాంతో అందరూ కలసి ఒక గల్ఫ్ ఏజెంట్‌ని కలిశారు. దుబాయి వెళ్ళి డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చినందుకు ఆ ఏజెంట్ వాళ్ళని అభినందించాడు. దుబాయ్‌లో ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీ అని చెప్పాడు. ఎంచక్కా ఒక్కొక్కళ్ళ దగ్గర్నుంచి లక్షన్నర రూపాయలు ఉద్యోగం, విమాన ఛార్జీలు, గట్రాల కింద వసూలు చేశాడు. ఆ తర్వాత ఈమధ్య వీళ్ళందర్నీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్ళాడు. అక్కడ అందర్నీ దుబాయ్ ఫ్లయిట్ అని చెప్పి ఓ విమానాన్ని ఎక్కించాడు. మీరు దుబాయ్‌లో దిగగానే మా మనిషి వచ్చి మిమ్మల్ని ఉద్యోగం ఇచ్చే షేక్ దగ్గరకి తీస్కెళ్తాడని చెప్పారు. దాంతో ఈ 45 మంది కుర్రాళ్ళు ఆనందంలో మునిగిపోయి ఏజెంట్‌ కాళ్ళమీద పడినంత పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కిన విమానం దుబాయికి కాకుండా ముంబాయికి వెళ్ళింది. దుబాయ్ విమానాశ్రయం భలే వుందని అనుకుంటున్న వాళ్ళకి అది దుబాయి కాదు ముంబయి అని ఆ తర్వాత తెలిసింది. చివరికి వాళ్ళకి జరిగిన మోసం అర్థమైంది. ముంబైలో రెండురోజులపాటు నానా తంటాలు పడి ఎలాగోలా స్వస్థలానికి చేరుకున్నారు. తమని మోసం చేసిన ఏజెంట్ కోసం వెతికాడు. ఆ ఏజెంట్ ఎందుకు కనపడతాడు? దాంతో వీళ్ళంతా లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu