బోరుగా వుందని ఉరేసుకుంది...
posted on Apr 3, 2015 4:34PM

ఆత్యహత్యలు చేసుకునేవాళ్ళు చెప్పే కారణాలు వింటుంటే తల తిరిగిపోతూ వుంటుంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడితే ఈ ప్రపంచంలో ఎవరూ బతికి వుండరని కూడా అనిపిస్తూ వుంటుంది. హైదరాబాద్‌కి చెందిన రజని అనే యువతి తనకు బోర్ కొడుతోందని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన సూసైడ్ లెటర్లో ఆమె ఈ విషయాన్నే రాసింది. విశాఖలోని గాజువాకకు చెందిన ఆమెకు ఈమధ్యే పెళ్ళి అయింది. హైదరాబాద్‌లో ఇటీవలే కొత్త కాపురాన్ని కూడా ప్రారంభించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ బాగానే వున్నారని అందరూ అనుకుంటున్న సమయంలో రజని అకస్మాత్తుగా ఉరి వేసుకుని మరణించింది. తనకు బోరుగా వుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ కూడా రాసింది. అయితే పోలీసుల విచారణలో ఒక విషయం తెలిసిందే. రజని పెళ్ళాడిన వ్యక్తికి గతంలోనే ఓ వివాహం జరిగింది. అతని మొదటి భార్య కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు రజని కూడా ఉరి వేసుకుని చనిపోయింది. దాంతో పోలీసులు ఈ మరణాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.