పేర్ని నానిపై కేసు నమోదు

 

వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో  నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని రెచ్చ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశారని తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని  శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వైసీపీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. రప్పా రప్పా నరికేస్తాం అంటూ అరవడం కాదని, రాత్రికి రాత్రే అంతా జరిగి పోవాలని అన్నారు. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు తమ ప్రభుత్వం వచ్చాక వేసేయాలని, తరువాత ఏమీ తెలియనట్టు పరామర్శించాలని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu