మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ఖర్గే, రేవంత్
Published on: Fri Jul 4, 2025 2:40PM

హైదరాబాద్ లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్నిఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


