కరోనాతో సోలి సొరాబ్జీ కన్నుమూత
posted on Apr 30, 2021 10:26AM
మాజీ అటార్నీ జనర, న్యాయ కోవిదులు సోలి సొరాబ్జీ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సొరాబ్జీ రెండు సార్లు అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. సోలి సొరాబ్జీ మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు
1930లో ముంబైలో జన్మించిన సోలీ సొరాబ్జీ, 1953లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు.తొలుత బాంబే హైకోర్టులో లాయర్ గా సేవలందించిన ఆయన్ను, 1971లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయన్ను గుర్తించారు. ఆపై 1989 నుంచి 90 మధ్య, 1998 నుంచి 2004 వరకూ భారత అటార్నీ జనరల్ గా సేవలందించడంతో పాటు మానహ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2002లో పద్మ విభూషణ్ తో సత్కరించింది.