కరోనా అప్ డేట్స్ .. 

దేశంలో క‌రోనా విలయం కొన‌సాగుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,86,452 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,97,540 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,498 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,08,330కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,53,84,418 మంది కోలుకున్నారు. 31,70,228   మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  28,63,92,086 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,20,107 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  

 

తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,926 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,441 మందికి క‌రోనా సోకింది.    
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu