నేను బొగ్గు మింగలేదు...

 

యూపీఏ పాలనలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మన్మోహన్‌సింగ్‌ పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. బొగ్గు స్కామ్‌ కేసులో మన్మోహన్‌ సింగ్‌తోపాటు మరో ఐదుగురిని ఏప్రిల్‌ 8న కోర్టులో హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు. ఈ కేసు విషయంలో తను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu