బ్యాంకు అధికారికి రిమ్మతెగులు...
posted on Mar 25, 2015 5:20PM

ఓ భారతీయ బ్యాంకు అధికారి తనకున్న అవలక్షణం కారణంగా దేశం కాని దేశంలో జైలుపాలయ్యాడు. అతని పేరు మహావిగ్నేశ్ వెలిప్పన్. అతను 32 ఏళ్ల వయసులోనే సింగపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఇంత టాలెంట్ ఉన్న అతనికి ఇంకో టాలెంట్ కూడా ఉందని నిరూపించాడు. చివరికి జైల్లో పడ్డాడు. ఇంతకీ ఎం టాలెంట్ అంటారా. సహోద్యోగులు, పక్కింటి వాళ్లు... చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడడం... వారీ శరీర భాగాల్ని రహస్యంగా ఫోటోలు తీయడం. అలా 2011లో అతని దుశ్చర్యలకు బాధితురాలైన ఒక సహోద్యోగి ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది. అతడు అలా తీసినవి ఏకంగా 596 వీడియోలు ఉన్నాయి. పోలీసులు మొత్తం 75 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదుచేశారు. మూడు సంవత్సరాల కేసు విచారణ తరువాత సింగపూర్ కోర్టు మంగళవారం అతనికి ఎనిమిదివారాల కఠిన కారాగార శిక్షను ఖరారుచేసింది. కాగా అతనికి విపరీత మానసిక లైంగిక రుగ్మతతో బాధపడుతున్నాడని అతని తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించగా విగ్నేష్ భారీ శిక్ష నుండి తప్పించుకున్నాడు.