మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనే చేయను... కిరణ్ బేడి

 

మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ గోవాలోని పనాజీలో జరిగిన ఉమెన్ ఎకానిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను క్రియాశీల రాజకీయ వేత్తను కానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఇంతకు ముందు లాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని, తన జీవితం ఎంతో సంపన్నమని, ఎంతో జ్ఞానయుతమని, ఎంతో అనుభవ సహితమని, ఎంతో అంతఃదృష్టితో కూడినదని వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల చాలా నేర్చకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ అనుభవం అని, ఆ అనుభవాన్ని ఇచ్చిన జీజేపీకి కృతజ్ఞతలని కిరణ్ బేడీ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున సీఎం అభ్యర్ధిగా పోటీ చేసి కిరణ్ బేడీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu