రోడ్డెక్కిన దువ్వాడ కుటుంబ వ్యవహారం!

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి రోడ్డెక్కింది. ఆయనను కలిసేందుకు ఆయన కుమార్తెలు హైందవి, నవీన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం వద్ద వున్న ఆయన ఇంటికి గురువారం నాడు వచ్చారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళిద్దరూ ఇంటిముందు నిరీక్షించినా దువ్వాడ  శ్రీనివాస్ ఇంటి గేట్లు తెరుచుకోలేదు. గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు చెప్పారు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని, లోపల కొన్ని ఇతరుల వెహికల్స్ కూడా వున్నాయని వారు చెప్పారు. తన మామగారు చనిపోయినప్పటికీ తన తండ్రి కనీసం పరామర్శకు కూడా రాలేదని దువ్వాడ పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించడం లేదని దువ్వాడ కుమార్తెలు బాధపడుతూ చెప్పారు. ఇదిలా వుండగా, దువ్వాడకు వివాహేతర సంబంధాలు వున్నాయని, అందువల్లే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు  చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu