స్టాలిన్ మళ్లీ చెయ్యి చేసుకున్నారు

 

డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్  మరోసారి ఓ సామాన్యుడి చెంప చెల్లుమనిపించి వార్తల్లోకెక్కారు. గతంలో కూడా ఒకసారి తను మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకుని తన ప్రతాపాన్ని చూపించారు. స్టాలిన్ కోయంబత్తూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో తన చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ స్టాలిన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. అయితే స్టాలిన్ అతనిని చేయి చేసుకోవడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో హల్ చల్ చేస్తుంది.

అయితే దీనిని స్టాలిన్ ఖండిస్తున్నారు. ఈవీడియోలో నిజం లేదని.. గ్రాఫిక్స్ యాడ్ చేశారని తాను ఆవ్యక్తిని నెట్టలేదని.. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు. ఇదిలా ఉండగా దీనిపై స్టాలిన్ మేనేజర్ చెప్పిన దానికి.. స్టాలిన్ చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఉంది. అది  యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు.