తన తప్పును సరిచేశాడని ఎమ్మెల్యేని పొట్టలో గుద్దిన హీరో..
posted on Nov 16, 2015 11:42AM

తన తప్పును సరిచేయడానికి చూసిన సొంత పార్టీ ఎమ్మెల్యేను పొట్టలో గుద్ది మీడియాకి ఎక్కారు డీఎండీకే అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు గాను తమిళనాడు కడలూరు లో అనేక గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆ గ్రామాల ప్రజలను పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ప్రజలను ఉద్దేశించి విజయకాంత్ మాట్లాడుత్న సమయంలో తప్పులు దొర్లాయి. దీంతో పక్కనే ఉన్న శివకుళందై అనే ఎమ్మెల్యే విజయకాంత్ తప్పులను సరిచేయడానికి చూశారు. అంతే విజయకాంత్ వెంటనే ఆ ఎమ్మెల్యే వీపుపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. పొట్టలో ఒక గుద్దు గుద్దారు. దాంతో ఎమ్మెల్యేకి ఎం చేయాలో తెలీకా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో నిల్చుండిపోయారట. కాగా విజయకాంత్ కు ఇలాంటి పనులు చేయడం కొత్తేమి కాదని.. ఆయన మధ్యమ ప్రియుడు కావడంతో మద్యం పుచ్చుకోవడం వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడని.. తరచూ ఇలాంటి వివాదాలతో మీడియాకి ఎక్కుతూనే ఉంటారని అనుకుంటున్నారు.