కల్లు తాగిన దిగ్విజయ్ సింగ్!

 

వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారం కోసం డిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సోమవారం వరంగల్లో పార్టీ కార్యాలయంలో కల్లు తాగారు. అదేమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. అది కూడా ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకోవడానికేనని సర్ది చెప్పుకోకతప్పదు. పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం గౌడ కులస్తులతో జరిగిన ఒక సమావేశంలో దిగ్గీ రాజావారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు తాము తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే, మోకు(తాడు)ను అందించగా, దానిని ఆయన తన మెడలో వేసుకొని వారు అందించిన స్వచ్చమయిన కల్లును కాంగ్రెస్ నేతలందరి సమక్షంలో లొట్టలేసుకొని తాగారు. తెరాస ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రంలో స్వచ్చమయిన కల్లు కంటే కల్తీ కల్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని, అది తాగి అమాయకులయిన ప్రజలు అనేకమంది అనారోగ్యం పాలవుతున్నారని దిగ్విజయ సింగ్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu