సొంత నియోజకవర్గంలో ధర్మాన పర్యటన
posted on Sep 11, 2012 9:51AM
.jpg)
వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో తనపేరుండడంపై స్పందించిన ధర్మాన ప్రసాదరావు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేశారు. ధర్మాన గతి ఇలాగైతే రేపు మన పరిస్థితేంటి అన్న భయం మిగతా మంత్రులకుకూడా పట్టుకుంది. హైలెవెల్లో తర్జనభర్జనలు జరిగాయి. రాజీనామాని ఆమోదించాలా వద్దా అనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అధిష్ఠానానికే వదిలేశారు. సోనియా ఆశీస్సులతో ధర్మాన రాజీనామాని పెండింగ్ లో పెట్టారు. తన నియోజకవర్గంలో తిరగడానికి ముఖం చెల్లక హైదరాబాద్ లోనే కాలం గడిపిన ధర్మాన ప్రసాదరావ్, అధిష్ఠానం తన రాజీనామాని పెండింగ్ లో పెట్టేసిన తర్వాత మొదటిసారిగా తన నియోజకవర్గానికి వెళ్లారు. తనని నమ్ముకున్న వాళ్లకు, తన మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, జరిగిన విషయాల్ని పూర్తిగా ఏకరువు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనివల్ల తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని సమర్ధంగా తిప్పికొట్టొచ్చని ధర్మాన గట్టిగా నమ్ముతున్నారు.