వరంగల్ బీజేపీ-టీడీపీ అభ్యర్థి దేవయ్య

 

వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ అభ్యర్థిగా దేవయ్యను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు అధికారికంగా ప్రకటిస్తారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్- రాజయ్య, వామపక్షాలు- గాలి వినోద్‌కుమార్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన దేవయ్య మీడియాతో మాట్లాడుతూ, తాను పుట్టిన ఊరుకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వరంగల్‌ను స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. దేవయ్య స్వస్థలం వరంగల్‌ జిల్లా కిసలాపురం. ఉస్మానియా యూనివర్సిటీలో దేవయ్య వైద్య విద్యను అభ్యసించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu