అభ్యుదయ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత

ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు దాశరథి రంగాచార్య సోమవారం కన్ను మూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మోదుగపూలు, చిల్లదేవుళ్లు, జానపదం నవలలు రచించడమేకాదు నాలుగువేదాలను తెలుగులోకి అనువదించిన గొప్ప రచయిత దాశరథి రంగాచార్య. ఆయన రాసిన చిల్లర దేవుళ్లు నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాశరథి రంగాచార్య మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu