కడపలో తెదేపా పాగా

 

వైయస్సార్ కుటుంబం కడపకు చెందినందున ఆ జిల్లాలో వారికి వారి వైకాపాకి మంచి పట్టు ఉండటం సహజం. ఇంతకు ముందు కేంద్ర సహకార బ్యాంక్ (డిసి.సి.బి.)కు వైకాపాకు చెందిన తిరుపేల రెడ్డి అధ్యక్షునిగా ఉండేవారు. కానీ నిన్న జరిగిన డిసి.సి.బి. ఎన్నికలలో తెదేపాకు చెందిన మాజీ యం.యల్యే వీరశివారెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి బ్యాంక్ అధ్యక్ష పీఠం స్వంతం చేసుకొన్నారు. తెదేపాకు 12మంది డిసి.సి.బి. డైరెక్టర్లుగా ఉండగా, వైకాపాకు కేవలం 8 మంది మాత్రమే ఉన్నందున తెదేపా తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన  అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైకాపాకు మెజార్టీ లేకపోవడంతో ఎన్నికలలో పోటీ చేయకుండా వాకవుట్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu