ఎమ్మెల్యేకి అవమానం

 

తనకు సచివాలయంలో అవమానం జరిగిందని సీపీఎం పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలో వచ్చిన రాజయ్యను సెక్యూరిటీ గార్డ్ గుర్తించకపోవడంతో ఐడీ కార్డు చూపించాలని కోరారు. దీంతో రాజయ్య ఐడీ కార్డు చూపించారు. అయిన కూడా ఆటోను లోపలికి అనుమతించకోపోవడంతో ఆగ్రహించిన రాజయ్య నిరసన వ్యక్తం చేస్తూ సీ బ్లాక్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాననీ, ఎమ్మెల్యేనని చెప్పినా కూడా సెక్యూరిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అయితే ఈ విషయం పై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని, అయినా ఎమ్మెల్యే అయితే కారులోనే రావాలా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాము ఐడీ కార్డు అడగలేదని, ఎమ్మెల్యే అని చెప్పిన తరువాత లోపలికి పంపిచామని సెక్యూరిటీ సిబ్బంది భిన్న వాదనలు వినిపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu