కడపలో కరోనా పాజిటివ్ కేసు.. 75 మంది పరేషాన్!
posted on Mar 28, 2020 11:22AM
కడప జిల్లాలో కరోనా కలకలం రేపింది. రెండు రోజుల పాటు జమ్మలమడుగులో మకాం వేసిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల రాజస్థాన్ నుంచి రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లలో దిగిన అతను.. జ్వరం రావడంతో ఈ నెల 23 న కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాడు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతని శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, సదరు పాజిటివ్ వ్యక్తితో దాదాపు 75 మంది సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 20 మందిని గుర్తించి ప్రొద్దుటూరు ఐసోలేషన్ హోంకు తరలించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.