దాసరి హస్తం కూడా ఉంది.. సీబీఐ


 

బొగ్గు గనుల కేటాయింపు కేసు ఇంకా విచారణలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సీబీఐ నివేదికను న్యాయస్థానానికి అందించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు.. అంతా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయంతోనే జరిగిందని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు అన్నా ఇప్పుడు సీబీఐ వాటిని ఖండించి దీనిలో దాసరి ప్రమేయం కూడా ఉందని చెప్పింది. జిందాల్ గ్రూపు కంపెనీలైన.. జిందాల్ స్టీల్ అండ్ పవర్.. గగన్ స్పాంజ్ ఐరన్ లకు అమరకొండా ముర్గాదంగల్ బొగ్గు గనులను కేటాయించేందుకు గాను పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, మాజీ బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా కలిసి జార్ఖంట్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని సీబీఐ చెప్పింది. దీనికి సంబంధించిన నివేదిక న్యాయస్థానానికి అందించింది.