కేటీఆర్ కు మీరే చెప్పాలి జగన్.. సీఎం


 


ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల రిలీవింగ్ పై ఎప్పటినుండో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికత ఆధారంగా ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవింగ్ చేసి వారికి వేతనాలు కూడా చెల్లించట్లేదు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది.

అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం రమేషే జగన్ కు ఫోన్ చేసి ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదని.. ఈ విషయంపై కేటీఆర్ తో మాట్లాడి వారికి వేతనాలు ఇప్పించాలని కోరారట. సీఎం రమేష్ చెప్పిన దానికి జగన్ కూడా సముఖత చూపించారట. అంతేకాదు జగన్ ఈ విషయంపై కేటీఆర్ తో కూడా మాట్లాడినట్టు.. ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

దీనికి కేటీఆర్ కూడా స్పందించి రిలీవింగ్ చేసిన విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ద్యుత్ సంస్థల యాజమాన్యంతో చెప్పినట్లుగా.. దీనిలో భాగంగానే విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను కలిసినట్టు తెలుస్తోంది. కాని ఇంతా జరిగిన ఈ అంశం కేసీఆర్ పరిధిలో ఉండటం వల్ల ఆ తరువాత కెటిఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారని అంటున్నారు.