జగన్ జోస్యం నెరవేరేనా?

 

ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి జోస్యంబా చెపుతున్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెపుతున్నారు. ఇంతకు ముందు కూడా జగన్ ఇంకా మూడేళ్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఉంటుందని.. తరువాత మాదే అధికారమని చెప్పుకొచ్చారు. మరి జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు కాని ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు అందరూ నవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది.

 

ఎందుకంటే అయిన దానికి కాని దానికి కేవలం టీడీపీ ప్రభుత్వాన్నిఇరుకున పెట్టాలని మాత్రమే జగన్ ఎప్పుడు చూసిన ధర్నాలు చేస్తుంటారు. ఆరకంగానైనా టీడీపీపైన ఒత్తిడి తీసుకురావచ్చనే ఉద్దేశం తప్ప ఏం లేదు. దీనిలో భాగంగానే మొన్న ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడెక్కడా ధర్నా చేయడానికి స్థలం లేనట్టు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేశారు. ఏమైంది.. ప్రతిపక్ష నేతలను విమర్శించి.. మీడియాలో కనిపించడం తప్ప వచ్చిందేమీ లేదు. అయినా ప్రతిపక్షాలను విమర్శించడానికి అక్కడివరకూ వెళ్లాలా అన్న వారు కూడా లేకపోలేదు. పోనీ ధర్నా వల్ల ఏమన్న పేరు వచ్చిందంటే అదీ లేదు.. ఎందుకంటే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ కూడా ధర్నా చేస్తానని చెప్పిన తరువాతే జగన్ ధర్నా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు ఎదురయ్యాయి.

ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా అంతే జరిగింది. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకన్నారు. ఇప్పుడు జగన్ ధర్నా అంటూ అక్కడ హడావుడి చేయడం తప్ప ఏంలేదు. మరోవైపు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.. ఇప్పుడు జగన్ ఏం చేసినా లాభం లేదని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మళ్లీ ఈనెల 29న రాష్ట్ర బంద్ కు కూడా పిలుపునిచ్చారు. మరి ఈబంద్ వల్ల ఏం ఒరుగుతుందో చూడాలి.

మొత్తానికి జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే ఇప్పటినుండే తరువాతం తానే సీఎం అని ‘‘కచ్చితంగా ఎప్పుడో చెప్పలేను కానీ అతి త్వరలోనే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని జోస్యం చెపుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు జగన్ పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని విమర్శిస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.