సైనాకు 50లక్షలు బహుమతి ఇచ్చిన సీఎం

 

 

CM N Kiran Kumar Reddy presents Rs 50 lakh to Saina Nehwal, CM N Kiran Kumar Reddy Saina Nehwal

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు శుక్రవారం 50 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. సైనా ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ను గెలిచినందుకుగానూ సీఎం బహుమతిగా ఈ చెక్‌ను ఇచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.

 

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ లభించింది. మార్చి 12 నుంచి 17 వరకు ఇక్కడ జరిగే ఈ టోర్నీకి ప్రపంచ నెం.1 చైనా క్రీడాకారిణి లీ జురేయీ ఆడకూడదని నిర్ణయించుకోవడంతో సైనా టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. 2011, 12 సంవ త్సరాల్లో స్విస్ ఓపెన్ చాంపియన్ అయిన సైనా.. తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ క్రీడాకారిణి సాషిన విగ్నెస్ వారన్‌తో తలపడనుంది. పీవీ సింధు కూడా ఇదే విభాగం తొలి రౌండ్‌లో కొరియా షట్లర్ సంగ్ జీ హ్యున్ తో పోటీ పడనుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu