సీఎం కిరణ్ ది క్రమశిక్షణారాహిత్య౦

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం క్రమశిక్షణా రాహిత్యమని సీనియర్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి లీకులపై కాంగ్రెసు అధిష్టానానికి సమాచారం ఉందని ఆయన అన్నారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఆయన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి హనుమంతరావుతో శనివారంనాడు సమావేశమయ్యారు.

 

ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటేనే నక్సలిజం పెరుగుతుందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం అధిష్టానం దృష్టికి వెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే మూడుగా విభజించాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.