సీఎం పదవిపై కేటీఆర్ మనసులో మాట..ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని

 

రాజకీయాల్లో వారసులకు ఎంట్రీ రావడం కానీ.. పదవు దక్కడం కానీ చాలా ఈజీ. ఇక కేటీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి కొడుకు... మరి అలాంటి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు పై డౌటేముంది. కేసీఆర్ తరువాత  సీఎం ఖుర్చీ కేటీఆరే కే దుక్కుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇవన్నీ మన ఆలోచనలు. మరి సీఎం కుర్చీ మీద కేటీఆర్ కన్ను ఉందా లేదా అనే విషయం మనకు తెలయదు. అయితే సీఎం కుర్చీపై మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చాను కానీ అది కేవలం రాజకీయాల్లోకి వచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ వరకే పనికొస్తుందని కేటీఆర్ చెప్పారు. నేను ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టి ఆ తరువాత నన్ను సీఎం చేస్తారనేది కేవలం ప్రచారమేనని కేటీఆర్‌ కొట్టిపారేస్తున్నారు. అసలు నేను మంత్రే అవుతానని అనుకోలేదు. ఇదే నా స్థాయికి ఎక్కువ. నాకంటే తెలివైన వారు వేలమంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కు సరితూగే నేతలు ఎవ్వరూ లేరని కేటీఆర్ అన్నారు. నేను మంత్రిని కాకపోయుంటే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని అని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లలో మూడుసార్లు గెలిచాను. నా పనితీరు బాగా లేకుంటే ఇక్కడ గెలవలెను కదా ! రాజకీయాల్లో నిలబడాలంటే ప్రజా బలం ఉండాలి అది లేని నాడు మనం రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిందే అని కేటీఆర్ చెప్పుకొస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu