కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్..కోటు, టై కట్టుకోవడం కాదు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎలాంటి మొహం మాటం లేకుండా వారికి క్లాస్ పీకుతుంటారు. ఇలాంటి సందర్భాలు చాలానే చూశాం. మళ్లీ నిన్న కలెక్టర్లతో సమావేశమయిన చంద్రబాబు వారికి కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సహజ వనరులు ఉన్నాయి.. వాటిని సద్వినియోగం చేయడంపై దృష్టి సారించాలి.. అంతేకాని కలెక్టరంటే కోటు, టై కట్టుకుని బ్రిటీష్‌ తరహాలో ఎసి గదుల్లో కూర్చుని పని చేయడం కాదు, పోటీతత్వంతో పని చేయాలని ఆదేశించారంట. ఈ సందర్భంగా కలెక్టర్లు రాబోయే ఆరు నెలల్లో తాము చేయాల్సిన పనుల నివేదికను సీఎంకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. కలెక్టర్ల పని విధానం మారాలని, జిల్లాల్లో ఏంచేయాలో వారే సూచనలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు కలెక్టర్లతో చర్చించినట్టు తెలుస్తోంది. అవి

* మలేషియాలో పెమాండూ విధానాన్ని ఇక్కడ అమలు చేయడం
* గృహనిర్మాణంలో నూతన పద్ధతులు
* ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్‌ భూములకు జియో ట్యాగింగ్‌ చేయాలని..
* రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1.60 వేల కిలోమీటర్ల మేర మ్యాపింగు..
* నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన కంపెనీలతో టైఅప్‌ చేసుకోవాలని
* స్వయం సహాయ సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణలు