వరంగల్ ఉపఎన్నిక.. ప్రచారానికి చంద్రబాబు వస్తారా?రారా?

 

వరంగల్ ఉపఎన్నిక బరిలో బీజేపీ-టీడీపీ నుండి బరిలోకి దిగబోయే అభ్యర్ధిగా దేవయ్య పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బరిలో దించడానికి అనేక మంది పేర్లు పరిశీలించిన బీజేపీ ఆఖరికి దేవయ్యను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న బీజేపీ.. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారా? అని అందరి సందేహం. ఎందుకంటే గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఏపీ సీఎం, తెలంగాణ సీఎంల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇరువురి మధ్య కాస్త వివాదాలు తగ్గి.. ఇప్పుడే స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. మరి ఈ సమయంలో ఆయన ప్రచారానికి వచ్చి కేసీఆర్ పై విమర్శలు చేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గెలుస్తోమో.. లేదో అంతగా నమ్మకం లేని ఈ ఎన్నిక ప్రచారానికి వెళ్లడం కంటే రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాస్త లాభం ఉంటుందని చంద్రబాబుకి పార్టీ నేతలు చెబుతున్నారంట. మరోవైపు బీజేపీ నేతలు కనుక ప్రచారంలో పాల్గొనమని ఒత్తిడి తెస్తే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్- రాజయ్య, వామపక్షాలు- గాలి వినోద్‌కుమార్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu