అభిమన్యుడిలా వెంకయ్య.. చంద్రబాబు కితాబు
posted on Aug 21, 2015 10:36AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని హైదరాబాద్ అభివృధ్ది జరిగింది.. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు కాని ఇప్పుడు రాష్ట్ర విభజన వల్ల హైదరబాద్ లేకుండా పోయింది. ఏపీలో హైదరాబాద్ లాంటి నగరం లేకపోయినా నిలదొక్కుకోవాలనుకుంటున్నాం.. దీనికి కేంద్రం తప్పకుండా సహకరించాలి.. సహకరించి తీరాలని అన్నారు.

ప్రత్యేకహోదా
ఇంకా ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తాను ఈ నెల 25 న భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా ఒక్క విషయమే కాకుండా ఇంకా ఏపీ రాష్ట్రానికి కావలనిన అవసరాలను.. ఏపీకి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లడతానని.. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా తయారుచేశామని తెలిపారు.
అభిమన్యుడిలా వెంకయ్యనాయుడు
అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభనప్పుడు వెంకయ్యనాయుడు ఏపీ కోసం చాలా పోరాడారన్నారు. కేవలం తమ పార్టీ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరగకుండా భవిష్యత్ లో ఏపీకి కావలసిన అవసరాలు.. సమస్యలు గురించి రాజ్యసభలో అభిమన్యుడిలా పోరాడారని.. దానిని ఎప్పటికీ మరిచిపోలేమని ప్రశంసించారు. అంతేకాదు వెంకయ్య ఢిల్లీలో ఉన్నంతకాలం రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగదని కితాబిచ్చారు. రాజధాని అవసరాలకు వెంకయ్య ముందుగానే స్పందించారని, ఇప్పటికే రూ.500 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.