ఆ హక్కు మాకే ఉంది... చంద్రబాబు

 

హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని.. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని..ఇతర పార్టీలు వేటికీ మాట్లాడే హక్కు లేదని అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించింది తామేనని.. తమ వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుందని చెప్పారు. అంతేకాదు హైదరాబాదులో రాత్రిపూట రోడ్లు ఊడ్చే విధానాన్ని తానే ప్రవేశ పెట్టానని.. ప్రజలు లేచి రోడ్ల పైకి వచ్చేసరికి శుభ్రంగా ఉండేవని తెలిపారు. టీడీపీ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులు అన్నీ రూపుదిద్దుకున్నాయి అన్నారు.

 

అంతేకాదు గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉదయాన్నే లేపే అలవాటు ఎన్టీఆరే అలవాటు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. అయితే కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ తాను అన్నదాంట్లో తప్పేముందని, ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు లేచేవారని, ఆయనను కలుసుకోవడానికి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉదయం ఐదు గంటలకే రావాల్సి వచ్చేదని.. అప్పట్లో కేసిఆర్ కూడా అదే సమయానికి వచ్చేవారని అది ఎన్టీఆర్‌తోనే మొదలైందని ఘాటుగా చెప్పారు. ఇప్పుడు ఆన తన దినచర్యను ఎప్పుడు మొదలు పెడుతున్నారో, ఆ పార్టీ వారికే తెలుసునని ఎద్దేవ చేశారు.