‘చంద్రన్న సంక్రాంతి కానుక’
posted on Dec 27, 2014 3:03PM

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పేదలకు ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్కో కుటుంబానికి 220 రూపాయల విలువ చేసే ఆరు వస్తువులను పంపిణీ చేస్తారు. వీటిలో కిలో గోధుమపిండి, కిలో శనగలు, అరకిలో కందిపప్పు, కిలో పామాయిల్, అరకిలో బెల్లం, వందగ్రాముల నెయ్యి వుంటాయి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటి 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద 280 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినప్పటికీ పండగ పూట రాష్ట్రంలోని పేదలను సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అని పేరు పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.