బ్రదర్ అనిల్‌ చేసేవి దొంగ ప్రార్థనలే

 

 

chandrababu ys sharmila, ys sharmila brother anil, jagan kiran kumar reddy

 

 

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కు భక్తి లేదని, అన్ని దొంగ ప్రార్థనలే అని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో లోటస్‌పాండ్‌లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.


తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జలయజ్ఞానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.30 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.


ముఖ్యమంత్రి కిరణ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఆయన తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని సీఎం కాపాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News