దారితప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్..

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పింది. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా చంద్రబాబే తెలిపారు. నిన్న సాయంత్రం హెలికాఫ్టర్ లో కడపకు బయలు దేరిన ఆయన 30 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాల్సింది పది నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారట. ఈ విషయాన్ని కడప విమానాశ్రయంలో స్వయంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా అనంతరం ఆయన కర్నూలులో రెండు భారీ ప్రాజెక్టులకు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు అల్ర్టా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లు మండలంలోని పుడిచర్లలో పరిశ్రమల హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రూ.3300 కోట్లతో 6 స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంచవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు రైతుల రుణమాఫీలు చేశామని.. అలాగే గొర్రెల, మేకల పెంపకందారుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu