'సినారె' కన్నుమూత..

 

తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కాగా 'సినారె' 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు జన్మించారు. 1953లో ‘ నవ్వని పువ్వు’ సినారె తొలి రచన. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారం అందుకున్నారు. 1977లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 1992లో పద్మభూషణ్ పురస్కారాలను పొందారు. సినారె రాజ్యసభ సభ్యునిగానూ సేవ‌లందించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన తన కలంపేరు 'సినారే'తో తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు. సినారే మృతి చెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.