గృహ నిర్భందంలో బైరెడ్డి..
posted on Sep 14, 2015 12:59PM

రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు గృహ నిర్భందం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం కర్నూలు జిల్లా తంగడంచ మండలంలో ఏపీ ప్రభుత్వం పరిశ్రమల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన రైతు బతుకు దెరువు యాత్ర, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన తగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈకారణంగా పాదయాత్రంలో పాల్గొనేందకు గాను పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలు బెరెడ్డి నివాసానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే కొంత మంది రైతులను అరెస్ట్ చేసి బైరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచింది. దీంతో బైరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.