బ్రతికుండగానే సమాధి...సమాధి నుండి తమ్ముడికి ఫోన్...

 


ఓ వ్యాపారవేత్తను బతికుండగానే సమాధిచేశారు. అతను తన తమ్ముడికి ఫోన్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్న విభేదాల కారణంగా రష్యాలో ఖిక్‌మెట్‌ సలేవ్ అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. అతడిని మాస్కోలోని ల్యూబర్టీ శ్మశానవాటికకు తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టారు. అయితే అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకోవడం మరిచిపోయారు. దీంతో ఖిక్‌మెట్‌ చాలా కష్టపడి తన ఫోన్ తీసుకొని..తమ్ముడు ఇస్మాయిల్‌కు ఫోన్‌చేశాడు. భాగస్వాములకు మొత్తం 30 మిలియన్‌ రూబుల్స్‌ను ఖిక్‌మెట్‌ చెల్లించాల్సి ఉండగా.. 1.2 మిలియన్‌ రూబుల్స్‌తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్‌ కారును కూడా ఖిక్‌మెట్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌లకు ఇవ్వగా.. సమాధి ఎక్కడుందో తెలిపారు. దీంతో ఇస్మాయిల్‌ వెంటనే సమాధి దగ్గరకు వెళ్లి తవ్వి బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దుండగుల దాడిలో కొన్ని పక్కటెముకలు విరిగిన ఖిక్‌మెట్‌కు చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu