సొంత సోదరుడే ఉదయ్‌కిరణ్‌‌ని చంపేశాడు..

 

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారం‌లో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం కనిపించింది. ఉదయ్ కిరణ్‌ని హత్య చేసిన వారు శవాన్ని నీటిలో వేశారు. శవం పైకి తేలకుండా ఉండటానికి మృతదేహం మీద పెద్ద బండరాయిని పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఉదయ్ కిరణ్‌ని అతని పెదనాన్న కుమారుడు నవీన్ హత్య చేసినట్టు కనుగొన్నారు. నవీన్ శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పెద్దల మధ్య వున్న ఆస్తి గొడవల కారణంగానే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఉదయ్ తల్లిదండ్రులకు చాలాకాలానికి కలిగిన ఒక్కగానొక్క కుమారుడు. అది కూడా సరోగసీ పద్ధతి ద్వారా జన్మించాడు. ఉదయ్ కిరణ్‌ని చంపిన నవీన్ గత కొంతకాలంగా ఏ పనీలేక జులాయిగా తిరుగుతున్నాడు. గతంలో హోంగార్డు ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే నకిలీ ధ్రువపత్రాలతో హోంగార్డు ఉద్యోగం పొందిన అతనిని విధుల నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu